telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మత మార్పిడి పై కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన మధ్యప్రదేశ్…

మత మార్పిడి విషయంలో కొత్త చట్టాలను తీసుకొని వచ్చింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. బలవంతంగా మతం మార్చితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది… ‘లవ్‌ జిహాద్‌’ మాట ఎలా ఉన్నా… లవ్ జిహాద్ పేరుతో… బలవంతంగా మత మార్పిడులకు పాల్పడుతున్నారని మండిపడుతున్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే.. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ఓ చట్టం తీసుకురాగా.. ఆ రాష్ట్ర గవర్నర్‌ కూడా ఆమోద ముద్ర వేశారు.. తాజాగా.. లవ్ జిహాద్‌కు చెక్ పెట్టేందుకు మధ్యప్రదేశ్ సర్కార్ కొత్త చట్టం తెచ్చింది. సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అధ్యతన సమావేశమైన కేబినెట్‌ సమావేశంలో మత స్వేచ్ఛ బిల్లు-2020కు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం.. షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు చెందిన మైనర్‌, మహిళలను బలవంతంగా మతం మార్చితే కనీసం రూ.50వేల జరిమానాతో పాటు పది సంవత్సరాల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉంది.. మత మార్పిడి కోసం బలవంతం చేస్తే 1-5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా విధించనున్నారు. ఈ కొత్త బిల్లులపై క్లారిటీ ఇచ్చిన సీఎం అశోక్ చౌహాన్.. ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ, అన్ని మతాలకు, కులాలకు చెందినది.. ఇందులో ఎలాంటి వివక్షతకు చోటు లేదని స్పష్టం చేశారు. చూడాలి మరి ఈ విషయంలో ప్రజలు ఏవిధంగా స్పందిస్తారు అనేది.

Related posts