ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టీ 20 మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ కు ఐసీసీ ఫైన్ విధించింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు కారణమైన భారత జట్టుపై మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ చర్యలు తీసుకున్నాడు. టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ ఫైన్ విధించాడు. నిన్న జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు నిర్దిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసింది. ఈ తప్పిదాన్ని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించడంతో పాటు పశ్చాతాపం వ్యక్తం చేయడంతో ఎలాంటి విచారణ లేకుండా మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభం అయిన తర్వాత భారత్‌కు జరిమానా పడడం ఇది మూడోసారి. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్‌కు రెండుసార్లు జరిమానా పడింది. ఈ సెకండ్ టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్ ఈ ఐదు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక ఈ జట్ల మధ్య మూడో టీ20 రేపు జరగనుంది.
previous post
next post
వైసీపీ ప్రభుత్వానికి ఆత్రమే తప్ప శ్రద్ధ కొరవడింది: కన్నా