telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విద్యార్థుల‌కు శుభవార్త చెప్పిన త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం…

school students

త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అక్కడి విద్యార్థుల‌కు శుభ‌వార్త చెప్పింది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల‌కు ఆన్‌లైన్‌ క్లాసులను సద్వినియోగం చేసుకునేందుకు రోజుకు 2 జీబీ డేటాను ఉచితంగా అందించాలని ఆ రాష్ట్ర స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది.. త‌మిళ‌నాడులోని కాలేజీ విద్యార్థులందరికీ ఉచితంగా ఈ డేటా కార్డులు అందించనున్నట్టు ప్ర‌క‌టించారు సీఎం పళనిస్వామి.. క‌రోనా ఎఫెక్ట్‌తో కాలేజీలు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వ‌హిస్తున్నందున‌.. విద్యార్థులు ఈ క్లాసులను సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఈ ప‌థ‌కం తీసుకొచ్చామ‌ని చెబుతున్నారు.. జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు రోజుకు 2 జీబీ డేటా చొప్పున ఉచితంగా అందించాలని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీల్లోని మొత్తం 9.69 లక్షల మంది విద్యార్థులు ల‌బ్ధిపొందుతార‌ని వెల్ల‌డించారు. కాగా, త‌మిళ‌నాడు త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.. దీంతో.. ఓట‌ర్ల‌ను బుట్ట‌ను వేసుకోవ‌డానికే స‌ర్కార్ ఈ ప‌థ‌కం తెచ్చింద‌ని విమ‌ర్శిస్తున్నాయి ప్ర‌తిప‌క్షాలు.. విద్యార్థుల‌పై ప్రేమే ఉంటే.. ఈ ప‌థ‌కాన్ని ముందే ఎందుకు తీసుకురాలేద‌ని ప్ర‌శ్నిస్తున్నాయి. ఏది ఏమైనా ఇది విద్యార్థులకు మాత్రం ఆనదని కలిగిస్తుంది అనే చెప్పాలి.

Related posts