telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు…

లోటస్ పాండ్ వద్ద వైఎస్ షర్మిల మాట్లాడుతూ… ఏపూరి సోమన్న ప్రతిమాట ఒక తూటా. తెలంగాణకు ఊపిరి ఆట పాట, తెలంగాణ సాంస్కృతిక జీవనం జానపదం. ఆ కళ గురించి మీకు చెప్పేంతటి దాన్ని కాదు. రచయితలకు, గాయకులకు, గజ్జె కట్టిన ప్రతి ఒక్కరికి నమస్కారం. నాపై నమ్మకంతో నాతో కలిసి నడిసేందుకు రావడం సంతోషం. వైఎస్ ఆర్ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు గొప్పవి. ఒక మనిషి చనిపోయాడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక 700 మంది చనిపోయారు. అందులో తెలంగాణ వారే ఎక్కువగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా పుట్టడం నా అదృష్టం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. ఉచిత విద్యుత్ ఇచ్చారు. విద్యుత్ బకాయిలు మాఫీ చేశారు. విద్యార్థులు గొప్ప చదువులు చదివి లక్షణంగా ఉద్యోగాలు చేస్తున్నారు. పేదవారు గొప్పవారిలా మంచి వైద్యం చేయించుకోవాలని ఆరోగ్య శ్రీ తెచ్చారు. మళ్ళీ రావాలి సంక్షేమ పాలన. మహిళలు ఆత్మగౌరవంతో బ్రతకాలి. పేదవాడు అప్పు ప్రతి పేదవాడికి ఆరోగ్య భద్రత కావాలి. బీసీ, ఎస్సి, ఎస్టీ వర్గాలు ఆత్మగౌరవంతో బ్రతకాలి. తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచించే పాలన కావాలి. నేను ఎవరితో యుద్ధం చేస్తున్నానో తెలుసు. చాలా పెద్ద కొండను ఢీ కొంటున్నామని తెలుసు అని పేర్కొన్నారు.

Related posts