telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ అసెంబ్లీలో కడప ఫ్యాక్షన్ ..అచ్చెన్నాయుడు ఫైర్

ache Naidu tdp

ఏపీ అసెంబ్లీలో కడప ఫ్యాక్షన్ ప్రవేశించిందని శాసనసభ టీడీపీ ఉపనాయకుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలపై తాము ఎక్కడ నిలదీస్తామోనన్న భయంతో సభ నుంచి గెంటేశారని అన్నారు. తమను అన్యాయంగా సభ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.

ఈ రోజు ఉదయం బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెన్షన్ కు గురైన ఆయన, మరో ఎమ్మెల్యే బుచ్చెయ్య చౌదరితో కలిసి అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ తాము ఇచ్చిన వీడియోలను కూడా సభలో ప్రదర్శించమంటే అనుమతివ్వలేదని, తనను కావాలనే సస్పెండ్ చేశారని అచ్చెన్నాయుడు అన్నారు. పెన్షన్లపై ప్రశ్నించడమే తన తప్పయిందన్నారు. దీనిపై మాట తప్పను – మడమ తిప్పను అని పదేపదే చెప్పే జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా జగన్ కంట్రోల్ చేయలేకపోతున్నారని దుయ్యబట్టారు.

Related posts