మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి వెల్లడించాడు. ‘స్పోర్ట్స్ డ్రామా ఒకటి చేయాలన్నది నా చిరకాల కోరిక. వాస్తవానికి గతంలో ఆర్బీ చౌదరి గారి బ్యానర్లో ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో ‘మెరుపు’ అనే సినిమాను స్టార్ట్ చేశాం కూడా. కానీ, కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్లలేదు, ఆగిపోయింది. అప్పటి నుంచీ కూడా స్పోర్ట్స్ నేపథ్యంలో ఆసక్తికరంగా సాగే ఒక కథ కోసం చూస్తున్నాను. అయితే, ఇంతవరకు నన్ను టెంప్ట్ చేసే స్క్రిప్ట్ మాత్రం దొరకలేదు. వస్తే కనుక కచ్చితంగా చేస్తాను’ అని చెప్పాడు చరణ్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని పూర్తిచేస్తున్న చరణ్ ఈ లాక్ డౌన్ సమయంలో పలువురు దర్శకులు చెప్పిన కొత్త కథలు కూడా విన్నాడు. వాటిలో కొన్నిటికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
previous post
బికినీలో అనుష్క శర్మ… కోహ్లీ రియాక్షన్…!