telugu navyamedia
సినిమా వార్తలు

విష్ణును ప్రకాష్ రాజ్ ను కలిపిన మోహన్ బాబు ..

“మా ” ఎన్నికలు రాజకీయ ఎన్నికలను మించిపోయాయి . ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికలు రెండు గ్రూపుల మధ్య పోరుగా మారి హోరాహోరీగా జరిగాయి . ఆరోపణలు , ప్రలోభాలు , పార్టీలు , బుజ్జగింపులు , ప్రాంతీయ సెంటిమెంట్ . ఇలా అనేక అంశాలతో ప్రకాష్ రాజ్ ప్యానల్ , మంచు విష్ణు ప్యానల్ పోరాటం చేశాయి .

Southsuper - Manchu Vishnu wins MAA Elections - Entrendz Showbizz
హైదరాబాద్ జూబిలీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఎన్నికలు నిర్వహించారు . ఉదయం 7. 30 గంటలకు వచ్చిన మోహన్ బాబు రాత్రి 11. 00 గంటలవరకు అవిశ్రాంతగా ఎన్నికలను పర్యవేక్షిస్తూ , ఓటువెయ్యడానికి వచ్చిన సహా నటీనటులను పలకరిస్తూ , కౌగిలించుకుంటూ , జోక్స్ వేస్తూ మహా హుషారుగా వున్నారు .
ఓటింగు మధ్యలో చిన్న గొడవ జరిగింది . దానికి మీడియా పెద్దది చేస్తుందేమోననే అనుమానంతో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు , ప్రకాష్ రాజ్ మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి “అంతా ప్రశాంతంగా జరుగుతుందని , మాలో మాకు ఎలాంటి గొడవలు లేవని ” చెప్పారు .

MAA elections 2021 results: 'Insider' Vishnu Manchu defeats 'outsider' Prakash Raj | Entertainment News,The Indian Express

అయినా రెండు ప్యానళ్ల మధ్య తోపులాటలు , హెచ్చరికలు , కొరకడాలు జరుగుతున్నాయి. వాతావరణం వేడి వేడి గానే ఉందని అందరికీ తెలుసు. రాత్రి 10. 15కు అధ్యక్షుడు గా మంచు విష్ణు  గెలుపొందారని ప్రకటించారు . బయట వున్న మోహన్ బాబు , విష్ణు అభిమానులు నినాదాలు చేసూ ఆనందంతో బాణాసంచా కాల్చారు . విష్ణు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు . ప్రకాష్ రాజ్ ముఖంలో రంగులు మారిపోయాయి. అయినా పైకి గంభీరంగా వున్నాడు .

Maa Elections: క్యా సీన్ హై.. ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు ఇలా ఒక్క‌ట‌య్యారు..! | The News Qube

ఇది గమనించిన మోహన్ బాబూ ప్రకాష్ రాజ్ దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు . ప్రకాష్ రాజ్ మోహన్ బాబు పాదాలకు నమస్కారం చేయబోయాడు . మోహన్ బాబు వారించాడు. విష్ణు చేయి పట్టుకొని ప్రకాష్ రాజ్ దగ్గరకు తీసుకు వచ్చి ఇద్దరినీ కలిపాడు . ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. అలా మోహన్ బాబు వేడిక్కిన వాతావరణాన్ని చల్లపరిచారు . ఎంతైనా మోహన్ బాబు “పెద రాయుడు ‘కదా !

Related posts