telugu navyamedia
తెలంగాణ వార్తలు

నేటి నుంచి ఖైరతాబాద్ గణపతి దర్శనం

ఈ సంవత్సరం ఖైరతాబాద్‌ మహా గణపతి.. శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనం ఇవ్వనున్నారు. విగ్రహ తయారీ పనులు చకచకా నడుస్తున్నాయి. ఈ నెల 10న వినాయక చవితికి నాలుగైదు రోజుల ముందే పనులు పూర్తయ్యేలా ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.ఈ ఏడాది 40 అడుగుల ఎత్తులో కొలువుదీరన్నారు. వినాయకుడు, పార్వతి, శివుడు, విష్ణు, సూర్య భగవానుడు …ఇలా 5 తలల తో భక్తులకు దీవెనలు ఇవ్వరున్నారు. దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠల శర్మ సూచన మేరకు కరోనా వైరస్‌ వ్యాప్తి నుంచి ప్రజలను కాపాడేందుకు శివుడి రుద్ర అవతారమైన పంచముఖ రుద్ర మహాగణపతిగా నామకరణం చేశారు.

మహాగణపతి కుడివైపు కృష్ణకాళి అమ్మవారు, ఎడమవైపు కాల నాగేశ్వరి అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటుచేశారు. కాగా మహా గణపతికి నేడు (శనివారం) ఉదయం 11.30 గంటలకు నేత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటి నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్న ఖైరతాబాద్ వినాయకుడు. వారం రోజుల ముందుగా దర్శనం ఇస్తున్న ఖైరతాబాద్ గణేషుడు.

Related posts