telugu navyamedia
సినిమా వార్తలు

నేను తప్పు చేశా..కానీ అది సరైనదే .. !

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయ్యారు. అశ్లీల చిత్రాలను తెరకెక్కిస్తున్నారన్న ఆరోపణలతో రాజ్ కుంద్రా అరెస్ట్ కావడం బాలీవుడ్‏లో సంచలనం సృష్టించింది. అతనికి వ్యక్తిరేకంగా పలువురు తారలు, మోడల్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అయితే రాజ్ కుంద్రా వ్యవహారంలో శిల్పా శెట్టి ప్రమోయం కూడా ఉందని పోలీసులు ఆమెను పలుమార్లు విచారించారు.

Shilpa Shetty shares cryptic post amid Raj Kundra pornography case, here's  what she posted

తన ఇమేజ్‌ డ్యామేజ్‌ అవడంతో మీడియా ముందుకు కూడా రావడానికి ఇష్టపడటం లేదు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఈ మధ్య ఇన్‌స్పిరేషనల్‌ కోట్స్‌ షేర్‌ చేస్తోంది. శిల్పాశెట్టి నిన్న సాయంత్రం తన ఇన్‏స్టాలో స్టేటస్ పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆమె ఓ పుస్తకంలో మిస్టేక్స్‌ అని రాసున్న అధ్యాయంలోని పేజీని షేర్‌ చేసింది.

Shilpa Shetty says she made 'A Mistake'

“చేసిన తప్పులకు జీవితాంతం మూల్యం చెల్లించాల్సిందే- సోఫియా లారెన్‌. చిన్నపాటి తప్పులు కూడా చేయకుండా మన జీవితాన్ని ఆసక్తికరంగా మలుచుకోలేం. అయితే ఆ తప్పులు భయంకరంగా, ఇతరులను బాధించేలా ఉండకూడదు. మిస్టేక్స్‌ ఎప్పుడూ ఉంటాయి. అవి మనకి సవాలు విసిరేలాగా, ఉత్తేజపరిచే అనుభవాలుగా, ఆసక్తికరంగా, లేదా వాటిని మర్చిపోయేదిగా ఉండాలి.

Shilpa Shetty says she made 'A Mistake'

చేసిన తప్పుల నుంచి కాకుండా వాటి నుంచి నేర్చుకున్న విషయాల వల్ల నేను తప్పులు చేయబోతున్నా’అయితే ఆ తప్పుల నుంచి నన్ను నేను క్షమించుకుని, వాటి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాను” అని రాసున్న పేజీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో యాడ్‌ చేసింది. నేను తప్పు చేశాను.. కానీ అది సరైనదే అంటూ ఆ కథకు యానిమేటెడ్ స్టిక్కర్ జతచేసింది.

Shilpa Shetty is in the List of Top 50 Tik-Tokers in the World | Latest &  Breaking News, India News, Political, Sports- Since independence

Related posts