telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బీచ్ లో గ్లోబల్ బ్యూటీ గుర్రపుస్వారీ… పిక్స్ వైరల్

priyanka

ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంకాచోప్రా, అమెరికా ప్రముఖ పాప్ గాయకుడు నిక్ జోనాస్‌లు కౌబాయ్ టోపీలు ధరించి బీచ్‌లో చెట్టాపట్టాలేసుకొని గుర్రపుస్వారీ చేశారు. ప్రియాంకా, నిక్ జోనాస్‌లు కలిసి చేతులు పట్టుకొని ఆనందంగా చేసిన హార్స్ రైడింగ్ చిత్రాలను వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.నలుపురంగు ప్యాంటు, బూట్లు, నల్లరంగు జాకెట్లు ధరించిన ఈ జంట చల్లనివేళ గుర్రపుస్వారీ చేసింది.ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ లు ప్రేమించుకొని 2018 డిసెంబరులో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

Related posts