telugu navyamedia
సినిమా వార్తలు

‘లైగర్’ నుంచి అదిరిపోయే అప్డేట్..

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ఇందులో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకోగా.. ప్రస్తుతం ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టారు మూవీ టీమ్‌. వరుస అప్ డేట్స్ తో హడావిడి చేస్తున్నారు.

తాజాగా లైగర్ సినిమాను పిబ్రవరి 25న రిలీజ్ చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు టీమ్. ఇక రేపు (31 డిసెంబర్ ) లైగర్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కాబోతోంది.

Image

నేడు  “లైగర్” నుంచి బీటీఎస్ పిక్స్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ స్టిల్స్ లో విజయ్ దేవరకొండ కెమెరా పట్టుకొని ఔట్​పుట్​ ఎలా వచ్చిందో చూస్తున్నాడు… అలాగే విజయ్​కు పూరీ సన్నివేశాన్ని వివరించిన‌ట్లు ఫోటోలు చూస్తుంటే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. 

ఈ సినిమాలో విజయ్​కు జోడీగా అనన్య పాండే నటిస్తోంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ హిందీ అరంగేట్రం చేస్తుంటే, అనన్య పాండే దక్షిణాది భాషల్లోకి ఎంట్రీ ఇస్తోంది.

விஜய் தேவரகொண்டா படத்தில் மைக் டைசன்: வைரலாகும் புகைப்படங்கள் | Vijay Deverakonda shoots with Mike Tyson in Los Angeles - hindutamil.in

పూరీ జగననాథ్ డైరెక్షన్ లో.. పూరీ కంటెంట్స్ తో కలిసి బాలీవుడ్స స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related posts