ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టీ 20, మూడు వన్డే, నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. అయితే అందులో డిసెంబర్ 17-21 వరకు జరిగే మొదటి టెస్టులో మాత్రమే భారత కెప్టెన్ విరాట్ ఆడనున్నాడు. ఆ తర్వాత కోహ్లీ తిరిగి భారత్ కు వచ్చేస్తాడు. ప్రస్తుతం కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రెగ్నెంట్. వారు జనవరిలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఇంతకముందే ప్రకటించారు. అందుకే అతను తిరిగి వచ్చేస్తున్నాడు. ఈ విషయం పై తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు స్పందించింది. ఆ బోర్డు చీఫ్ మాట్లాడుతూ… క్రికెట్ లో కోహ్లీ గొప్ప ఆటగాడు. అయితే అతను మొదటిసారి తండ్రి కాబోతున్న సందర్బంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాము. కోహ్లీ పరిమిత ఓవర్ల సిరీస్ లతో పాటుగా మొదటి డే అండ్ నైట్ టెస్ట్ లో ఆడటం సంతోషం. అయితే విరాట్ ఒక్కసారి భారత్ కు వెళ్లిన తర్వాత మళ్ళీ తిరిగి ఆసీస్ వస్తాడు అని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే… కోహ్లీ వస్తే తప్పకుండ 14 రోజుల క్వారంటైన్ లో ఉండాల్సిందే.. ఇది చాల లాంగ్ ప్రాసెస్ అని ఆసీస్ బోర్డు చీఫ్ తెలిపాడు. అయితే ఈ పర్యటన నవంబర్ 27న ప్రారంభం అవుతుంది.
previous post
next post
రాబర్ట్ వాద్రాను వదిలేది లేదు: మోదీ