telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్దం

sabita reddy rangareddy tour as minister

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లుపూర్తి చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని అన్నారు. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. మొత్తం 9.65 లక్షల (ఫస్టియర్‌ 4,80,531, సెకండ్‌ ఇయర్‌ 4,85,345) మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

ఇంటర్‌ పరీక్షల్లో మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను నిషేధించారు. ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులు నేరుగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోచ్చు. పరీక్ష కేంద్రాలను తెలుసుకోవడానికి సెంటర్‌ లొకేటర్‌ యాప్‌ను రూపొందించారు. విద్యార్థులు ఎలాంటి అనుమానాలు ఉన్నా bigrs.telangana.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Related posts