కొత్త మండలాల ఏర్పాటుపై కెసిఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను వెలువరించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో మహమ్మదాబాద్, వికారాబాద్ జిల్లాలోని చౌడాపూర్ లను కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 10 గ్రామాలతో మహమ్మదాబాద్ మండలం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మహమ్మదాబాద్, సంగాయిపల్లి, అన్నరెడ్డిపల్లి, ముకర్లబాద్, లింగాయిపల్లి, మంగంపేట, చౌదర్‌పల్లి, గండిర్యాల, నంచెర్ల, జూలపల్లి గ్రామాలు ఉన్నాయి. అటు మొత్తం 14 గ్రామాలతో చౌడాపూర్ మండలం ఏర్పాటు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. చౌడాపూర్, మండిపాల్, వీరాపూర్, విఠలాపూర్, మక్తా వెంకటపూర్, అడవి వెంకటాపూర్, లింగంపల్లి, కొత్తపల్లి, పురుసంపల్లి, మల్కాపూర్, మరికల్, కన్మన్ కాల్వ, మొగిలపల్లి, చాకల్‌పల్లి గ్రామాలున్నాయి.
ప్రజలు మార్పు కోరుకున్నారు: గంటా శ్రీనివాస్