telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెగ వైరల్ అవుతున్న పవన్ “వకీల్ సాబ్” క్లైమాక్స్ ఫోటోలు.!

2018లో విడుద‌లైన `అజ్ఞాత‌వాసి` త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌లేదు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మ‌ళ్లీ ప‌వ‌న్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లో విజ‌యవంత‌మైన `పింక్‌` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దిల్‌రాజు, బోనీక‌పూర్ నిర్మాత‌లుగా వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొంద‌నుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న క్షణం రానే వచ్చింది. ఈ మూవీ షూటింగ్‌ కూడా తుది దశకు వచ్చింది. ఈ వేసవికి సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. అయితే.. సంక్రాంతి కానుకగా ఈ సినిమా టీజర్‌ వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు ప్రముఖ నటుడు దేవ్‌గిల్‌ సర్‌ఫ్రైజ్‌ ఇచ్చాడు. ఈ సినిమా క్లైమాక్స్‌ ఫైట్‌కు సంబంధించిన ఫొటోని తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇది కొద్ది నిమిషాల్లోనే వైరల్‌ అయింది. ఈ స్టిల్స్‌ను బట్టి చూస్తే… సినిమాలో చాలా మార్పులు చేశారని అర్ధమవుతుంది. కాగా..ఈ ఏడాది ట్విట్టర్ లో ట్రెండ్ అయిన ట్యాగ్స్ లలో ‘వకీల్ సాబ్’ కూడా నిలిచింది అంటే హవా ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. వీలైనంత వరకు టీజర్ లో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడట.

Related posts