telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీదేవి నటించిన ‘మామ్’ .. చైనాలో ప్రభంజనం ..

sridevi mom movie new records in china

హీరోయిన్ శ్రీదేవి అర్ధాంత‌రంగా క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. 53 ఏళ్ల వ‌య‌స్సులో 300 సినిమాలు చేసిన శ్రీదేవి ఇప్ప‌టికీ సినిమాల రూపంలో మ‌న క‌ళ్ళ ముందు క‌ద‌లాడుతూనే ఉంది. ఎన్నో ఏళ్ల పాటు గ్లామర్ క్వీన్ గా వెలిగిన శ్రీదేవి పెళ్లయ్యాక కొంత గ్యాప్ తీసుకుని ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇంగ్లీష్ వింగ్లీష్ తర్వాత పులి అనే తమిళ సినిమా చేసింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ అతిలోక సుందరి మామ్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకులని ప‌ల‌క‌రించింది. ఆమె భర్త బోనీకపూర్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందింది. రవి ఉడయార్ డైరెక్షన్ లో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. అక్షయ్ ఖన్నా, అభిమన్యూ సింగ్ కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రాన్ని మ‌న దేశంలోనే కాకుండా పోలెండ్‌,ర‌ష్యా, అమెరికా, ఇంగ్లాండ్, యూఏఈ వంటి 39 దేశాల‌లో మామ్ చిత్రాన్ని విడుద‌ల చేసిన జీ స్టూడియోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ చైనాలోను విడుద‌ల చేసింది. శుక్రవారం అక్కడ విడుదలైన ‘మామ్‌’ మంచి ఆదరణ దక్కించుకుంటోంది. తొలిరోజు సుమారు రూ.11.47 కోట్లు వసూలు చేసినట్లు బాలీవుడ్ విశ్లేష‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ వెల్ల‌డించారు. బాలీవుడ్ సూప‌ర్ హిట్ చిత్రం అందాధున్ చిత్ర కలెక్ష‌న్స్‌ని మామ్ బ్రేక్ చేసింద‌ని అంటున్నారు. మామ్ సినిమా ప్రతి ప్రాంతంలోని తల్లులకు, ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుంది. ఇది శ్రీ చివరి సినిమా. ఈ అందమైన కథను అందరికీ చెప్పి, ఆమె చివరి మధురమైన సినిమాను వీలైనంత మందికి చూపించాలనేదే మా ఉద్దేశం అని బోని క‌పూర్ తెలిపిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంకి సంగీతం అందించిన ఏఆర్ రెహ‌మాన్‌కి నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. అలానే అన్యాయానికి గురైన తన కూతురి కోసం పోరాడే తల్లి పాత్రలో నటించిన శ్రీదేవి కూడా ఉత్తమ నటిగా జాతీయ పుర‌స్కారం అందుకున్నారు.

Related posts