telugu navyamedia
సినిమా వార్తలు

అమెజాన్ ప్రైమ్ లో విశ్వక్ సేన్ “పాగల్”

ఓటీటీలోకి విశ్వక్ సేన్ సినిమా.. అమెజాన్‏లో పాగల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే…
టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్.. నివేదా పేతురాజ్ జంటగా నటించిన లెటేస్ట్ చిత్రం పాగల్. ఈ చిత్రానికి నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించగా…దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ లక్కీ మీడియా బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.

Paagal': Trailer of Vishwak Sen's film to be screened only in theaters |  Telugu Movie News - Times of India

ఇటీవల ఆగస్ట్ 14న రెండువారాల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ పాగల్ చిత్రాన్ని కొనుగోలు చేసింది. సాధారణంగా ఏదైనా సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలో రావాలంటే రెండు నెలలు సమయం పట్టేది. కానీ కొవిడ్ కారణంగా నిర్మాతలు దీన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. రూల్స్ బ్రేక్ చేసుకుని ఓటీటీలతో ఒప్పందం చేసుకోవడంతో ఇండస్ట్రీలో డిస్కషన్స్ నడుస్తున్నాయి.విశ్వక్ సేన్ తాజా చిత్రం పాగల్ కూడా ఇప్పుడీ లిస్టులో చేరింది.

Vishwaksen confused between two dates?

అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ మూడవ తేదీ నుండి ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.  ఈ సినిమాకు రధాన్ సంగీతం అందించగా.. ఇందులో విశ్వక్ తల్లి ప్రేమ లాంటి ప్రేమ అందించే అమ్మాయి కోసం తపన పడే యువకుడి పాత్రలో నటించాడు.

Paagal Movie Review: A quirky tale of love based on a flimsy story-line

తాజాగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడు… డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, నిర్మాతలు సంతోషంగా ఉన్నప్పుడే ఓ సినిమా సూపర్ హిట్ అయినట్లుగా భావిస్తాను అని అన్నారు. అంతేకాకుండా.. పాగల్ సినిమాకు వసూల్లు బాగా వచ్చాయని.. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం సంతోషంగా ఉందన్నారు.

Review: Paagal - English

కరోనా సమయంలోనూ ప్రేక్షకులు సినిమా చూడ్డానికి వచ్చారని.. తమ మూవీకి కలెక్షన్ ఎక్కువగానే వచ్చినట్లుగా నిర్మాత తెలిపారు. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ తర్వాత ఆడియన్స్‌ ఆశించిన స్థాయిలో థియేటర్స్‌కు రావడం లేదు. థర్డ్‌ వేవ్‌ వస్తుందని వినిపిస్తున్న వార్తలు కూడా ఓ కారణం కావొచ్చు. మిడిల్‌ క్లాస్‌ ఆడియన్స్‌ థియేటర్స్‌కు వచ్చినప్పుడే పెద్ద స్థాయి కలెక్షన్స్‌ చూడొచ్చు అంటూ చెప్పుకోచ్చారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ పాగల్ మూవీ ట్రైలర్ విడుదల చేసింది.

 

Related posts