telugu navyamedia
సినిమా వార్తలు

అయినోళ్ల కంటే ఆస్తులేం ఎక్కువ కాదు..

నేచురల్‌ స్టార్‌ నాని ‘టక్ జగదీష్’ ట్రైలర్ వచ్చేసింది. ఈ సారి టీజర్ కంటే భిన్నంగా.. భావోద్వేగ సన్నివేశాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. నాని రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. సెప్టెంబరు 10న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ‘టక్ జగదీష్’ సినిమాను విడుదల చేయనున్నట్లు.. ఇటీవలే ప్రకటించారు.

‘నిన్ను కోరి’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాన్ని అందించిన శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడు. సినిమా విడుదల దగ్గరపడటంతో బుధవారం ట్రైలర్ రిలీజైంది. భూదేవి కొడుకు గురించి ఒక కథ చెప్పాలి అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. ఇందులో నాయుడుగారి అబ్బాయి టక్‌ జగదీష్‌గా పర్ఫామెన్స్‌తో, భావోద్వేగ సన్నివేశాలతో గుండె బరువెక్కించాడు నాని.

Tuck Jagadish Release: Nani Starrer To Take The OTT Route? - Filmibeat

‘అయినోళ్ల కంటే ఆస్తులు, పొలం ఎక్కువ కాదు, రక్త సంబంధం విలువేంటో తెలుసుకోరా..’ అంటూ నానికి మంచి విషయాలు బోధిస్తున్నాడు అతడికి అన్నయ్య పాత్రలో నటించిన జగపతిబాబు. ‘భూ కక్షలు లేని భూదేవిపురం చూడాలనేది మా నాన్న కోరిక, ఇప్పుడది నా బాధ్యత’, ‘నా కుటుంబం ఓడిపోతే నేను ఓడిపోయినట్లే’ అంటున్నాడు నాని.

Watch: Nani's 'Tuck Jagadish' teaser released | The News Minute

ఈ చిత్రంలో నానికి అన్నగా జగపతిబాబు కనిపించనున్నారు. అయితే, వీరిద్దరు ఒకే తల్లి బిడ్డలు కాదని తెలుస్తోంది.అలాగే.. చివర్లో ‘‘బాబాయ్ నువ్వు మా ఫ్యామిలీ కాదా?’’ అని చిన్నారి అడిగే ప్రశ్నకు.. నాని ‘‘తెలియట్లేదమ్మా’’ అంటూ భావోద్వేగానికి గురయ్యే సన్నివేశంతో ట్రైలర్ ముగిసింది.

ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో సెప్టెంబర్‌ 10న రిలీజ్‌ కానుంది. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో నాని హీరోగా, జగపతిబాబు ప్రధాన పాత్రలో, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. టక్ జగదీష్ కు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించాడు.

Related posts