telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాని “టక్ జగదీష్”పై “వి” ఎఫెక్ట్…!

Tuck-Jagadish

నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ.. ‘టక్ జగదీష్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాని సరసన ‘పెళ్ళి చూపులు’ ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. షైన్ స్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. మళ్లీ సాధారణ పరిస్థితులు రాగానే షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సినీ వర్గాల్లో చెక్కర్లు కొడుతుంది.ఈ సినిమాలో కొన్ని మార్పులు జరగనున్నాయని తెలుస్తుంది. ‘వి’ ఫలితం నేపథ్యంలో జగదీష్ మూవీలో మార్పులు చేర్పులు చేయాలని నాని కోరడంతో కొన్ని ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ ను ప్రత్యేకంగా జోడించినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనీ చూస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో మరోసారి సాయి పల్లవి నానితో జతకట్టనుందని తెలుస్తుంది. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నాచురల్ స్టార్ నాని. ఓ వైపు హీరోగా మరో వైపు ప్రొడ్యూసర్ గా హిట్స్ అందుకుంటున్నాడు. తాజాగా నాని సుధీర్ బాబు తో కలిసి నటించిన వి సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

Related posts