telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

కొత్త ఛాలెంజ్ ను ప్రారంభించిన విజయ్ దేవరకొండ…

ప్రస్తుతం యూత్ లో బాగా క్రేజ్ సంపాదించుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ ముందుంటాడు. అయితే వచ్చిన మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన విజయ్ దేవరకొండ.. వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్ లాంటి ఫ్లాపులతో వెనకబడ్డాడు. ఇప్పుడు పూరీ ఫైటర్ సినిమాతో వస్తున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ 30 రోజుల్లో బరువు తగ్గే ఛాలెంజ్ ని జూబ్లీహిల్స్ లో ఫిట్నెస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఛాలెంజ్ కి సంబంధించిన వెబ్ సైట్ తో పాటు ఛాలెంజ్ ను ప్రారంభించారు. 15 సంవత్సరాల పైగా అనుభవంతో హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధి చెందిన ఈ ఫిట్నెస్ లో సినీ, రాజకీయ, బిజినెస్ ప్రముఖులందరు పాల్గొంటున్నారు.  విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘నేను గత మూడు సంవత్సరాలుగా ఈ జిమ్ కు వస్తున్నాను. కరోనా ముందు ఇక్కడ ఎంతో మంది వచ్చి జిమ్ చేయడం చూశాను. లాక్ డౌన్ లో జిమ్ కు వచ్చే వాళ్లు తగ్గినా ఇప్పుడు మళ్లీ రావడం పెరుగుతోంది. నేను ఫైటర్ సినిమా కోసం బెస్ట్ బాడీ షేప్ తీసుకొచ్చాము. ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరు తమ ఫిట్నెస్ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు’ అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఇది ఎలా ముందుకు వెళ్తుంది అనేది.

Related posts