telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రానా పెళ్ళి శుభలేఖ వైరల్… పెళ్ళి ఎక్కడంటే ?

rana

దగ్గుబాటి రానా పెళ్ళి విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మిహికా బజాజ్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రానా పెళ్ళి విషయాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే. ఆ వెంటనే రంగంలోకి దిగిన రానా తండ్రి, నిర్మాత సురేష్ బాబు ఆగస్టు 8వ తేదీన రానా పెళ్లి ఉంటుందని ప్రకటించారు. ఆ తర్వాత మే 21వ తేదీన రానా, మిహిక కుటుంబాలు రోకా ఫంక్షన్ ద్వారా ఒక్కటై వారి పెళ్లి జరగనుందని అధికారికంగా తెలిపారు. ఇక తాజాగా ఇరు కుటుంబాలు అనుకున్న ఆ తేదీ ఆగస్టు 8నే పెళ్లి వేడుక జరగనుందని పేర్కొంటూ ఓ‌ పెళ్లి పత్రికను అందరి ముందుంచారు. ఈ వివాహ పత్రికను వీడియో రూపంలో ఎంతో అద్భుతంగా డిజైన్ చేయడం విశేషం. పౌరాణికం థీమ్‌ తీసుకొని పాత చిత్రం ‘మాయాబజార్’లోని సన్నివేశాన్ని జత చేస్తూ రానా, మిహికాల ఫొటోలతో ఆసక్తికరంగా రూపొందించారు. దీంతో రానా వివాహ పత్రిక క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు, చైతన్య ఎన్‌క్లేవ్, ఖాజాగూడ, మణికొండ, హైదరాబాద్‌లో రానా- మిహికా వివాహం జరుగుతుందని ఈ పత్రిక ద్వారా వెల్లడించారు. అయితే కరోనా విలయతాండం చేస్తున్న కారణంగా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే రానా వివాహ వేడుక జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నట్లు సమాచారం.

Related posts