బీరు పుచ్చుకొని ఈ ఎండాకాలం చల్లగా ఉండాలని చాలామంది మందుబాబులు చూస్తారు. చల్లటి బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తారు. అయితే వారందరికి చిన్నపాటి షాక్ ఇచ్చే ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. అక్కడి ఎక్సైజ్ అధికారులు తాజాగా 1,24,000 లీటర్ల బీరును రోడ్డుపై పారబోశారు. అన్ని బాటిళ్లను త్వరగా ధ్వంసం చేసేందుకు బుల్ డోజర్లతో తొక్కించారు.
భారీగా మద్యం నిల్వలు నోయిడాలోని ఓ గోదాములో ఉన్నట్లు సమాచారం అందుకున్న అధికారులు పోలీసులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. అనంతరం తనిఖీలు చేపట్టగా, మూడు కోట్ల రూపాయల విలువైన 11,652 బీర్ బాటిళ్లు దొరికాయి. అయితే వీటిలోని బీర్ కాలపరిమితి ముగిసిపోయినట్లు అధికారులు గుర్తించారు. దీనితో మొత్తం బాటిళ్లను ఒకేచోట పారబోసి, బుల్ డోజర్లతో తొక్కించారు.
విశ్వం మా ఇద్దరినీ ఒకే చోట చేర్చింది… లాక్ డౌన్ అనుభవాన్ని షేర్ చేసిన రకుల్