telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొత్త ఫోటోలు షేర్ చేసిన కాజల్

Kajal

టాలీవుడ్ చందమామ, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న తన ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులు ఈ నవ దంపతులకు స్పెషల్‌గా విషెస్ చెబుతున్నారు. ముంబైలోని స్టార్ హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్‌లో కాజల్- గౌతమ్ వివాహ వేడుక జరిగింది. పంజాబీ, కశ్మిరీ సంప్రదాయల్లో ఈ వేడుక నిర్వహించారు. కేవలం ఇరు కుటుంబాల సన్నిహితులు, దగ్గరి బంధువులు మాత్రమే కాజల్ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. హోమ్ డెకార్, ఇంటీరియర్ డిజైన్ కంపెనీని నడిపిస్తూ ప్రముఖ వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు కాజల్ భర్త గౌతమ్ కిచ్లు. ప్రస్తుతం కాజల్ పెళ్ళి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మరో రెండు ఫోటోలను కాజల్‌, ఆమె చెల్లి నిషా అగర్వాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ ‌చేశారు. నిషా షేర్‌ చేసిన ఫొటో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉంది. ఇందులో నవదంపతులిద్దరు ఆనందంగా నవ్వుతూ కనిపించారు. ఇక కాజల్‌ షేర్‌ చేసిన ఫొటోలో ఆమె పసుపు రంగు చీర కట్టుకొని మ్యాచింగ్‌ మాస్క్‌ పెట్టుకొని ఉంది. గౌతమ్‌కిచ్‌లు వైట్‌ కలర్‌ షేర్వాణి ధరించి వైట్ కలర్‌ మాస్క్‌ ధరించాడు.

Related posts