అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ బిగ్‌బాస్ షో ద్వారా తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించి అభిమానులను అలరించారు. ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కోసం నాగ్ ప్రస్తుతం హిమాలయాల్లో ఉన్న విషయం తెలిసిందే. అక్కడే 21 రోజులు ఉండబోతున్నారు. అందుకని బిగ్‌బాస్ బాధ్యతను కోడలుపిల్ల సామ్ భుజాలపైన వేశారు. ఈ క్రమంలో సామ్ చేసిన దసరా ఎపిసోడ్‌ను కలుపుకుని మొత్తంగా ఐదు ఎపిసోడ్లు చేయనున్నట్లు తెలుస్తోంది. సమంత హోస్టింగుకు వీక్షకులు కూడా మంచి మార్కులే వేశారు. తాజాగా బిగ్ బాస్ హోస్ట్ చేయటంపై సమంత కామెంట్ చేశారు. “గతంలో ఒక్క బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా చూడలేదు. యాంకరింగ్ చేసిన అనుభవం లేదు. తెలుగు సరిగా మాట్లాడగలనో లేదో తెలియదు. అందుకే మామగారు బిగ్ బాస్ హోస్ట్ చేయమన్నప్పుడు భయపడ్డాను. అవన్నీ పక్కన పెట్టి నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు థ్యాంక్యూ మామ. ఎపిసోడ్ టెలికాస్ట్ తరువాత నాకు అందుతున్న ప్రేమకు మీ అందరికీ కూడా థ్యాంక్స్” అని సమంత ట్వీట్లో పేర్కొన్నారు.
next post