telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే.. శిక్ష నుండి తప్పించుకునే బిల్లు..

rape with marriage is legal a bill by turkey

ప్రభుత్వాలు ఎన్ని కఠినతరమైన చట్టాలు తెచ్చినా నిత్యం ఎక్కడో ఒక చోటు అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అత్యాచార నిందితులకు ఉరే సరైన శిక్ష అని దేశవ్యాప్తంగా ప్రజల నుంచి డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టర్కీ పార్లమెంట్‌లో ఓ వివాదాస్పదమైన బిల్లును ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది. తూర్పు దేశమైన టర్కీలో రేపిస్టులను శిక్ష నుంచి తప్పించేలా ఓ చట్టాన్ని రూపొందిస్తున్నారు. అదే ‘మ్యారీ యువర్ రేపిస్ట్’. ఇక దీనికి సంబంధించిన బిల్లును ఈ నెల చివరన పై పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. 18 ఏళ్ళ లోపు చిన్నారులపై లైంగిక దాడి లేదా అత్యాచారం చేసిన నిందితులకు ఇది వర్తిస్తుంది.

లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితులు శిక్ష నుంచి మినహాయింపు పొందాలంటే.. అత్యాచార బాధితురాలిని తప్పనిసరిగా పెళ్లి చేసుకునేలా ఈ బిల్లును సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ బిల్లు టర్కీలో వివాదాస్పదం కావడమే కాదు.. మహిళ హక్కుల ప్రచారకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇలాంటి వివాదాస్పద బిల్లే ఒకటి 2016లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. నాడు ఆ బిల్లుపై దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటడంతో పీపుల్స్ డెమోక్రెటిక్ పార్టీ ఆ బిల్లును ఉపసంహరించుకుంది.

Related posts