ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఆయన బుధవారం మృతి చెందారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ అకాలమరణంపై మెగాస్టార్ చిరంజీవి దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. “వేణుమాధవ్ తొలిసారి నాతో కలిసి ‘మాస్టర్’ సినిమాలో నటించాడు. అటుపై పలు సినిమాల్లో నటించి హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు. కొన్ని పాత్రలు తనకోసమే పుట్టాయన్నంతగా నటించేవాడు. ఆ పాత్రకే వన్నెతీసుకొచ్చే వాడు. వయసులో చిన్నవాడు. సినీ పరిశ్రమలో తనకింకా బోలెడంత భవిష్యత్ ఉందని అనుకునేవాడిని. కానీ దేవుడు చిన్న చూపు చూశాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను” అని అన్నారు
అతన్నే పెళ్ళి చేసుకుంటా… లవ్ ఎఫైర్ పై కియారా కామెంట్స్