టాలీవుడ్ కింగ్ నాగ్ పదిహేనేళ్ళ తర్వాత “బ్రహ్మాస్త్రా” అనే బాలీవుడ్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో “బ్రహ్మాస్త్రా” చిత్రం తెరకెక్కుతుంది. మూడు విభాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి విభాగం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. 2003లో నాగ్ ‘ఎల్.ఓ.సి.కార్గిల్’ అనే హిందీ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో నాగార్జునపై వారణాసిలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. లండన్‌లోను ఆయన పార్ట్‌కి సంబంధించిన కొంత చిత్రీకరణ జరిగింది. అయితే చిత్రంలో నాగ్ పురాతత్వ శాస్త్రవేత్తగా కనిపించనున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఆయన వారణాసిలో పలు పరిశోధనలు చేయనున్నారని అంటున్నారు. ఇక చేతుల నుంచి నిప్పును రప్పించే శివ పాత్రలో రణ్‌బీర్, ఇషా పాత్రలో ఆలియా కనిపిస్తారు. శివ పాత్రకు గురువుగా అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. డింపుల్ కపాడియా, మౌనీ రాయ్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ మనాలిలో జరుగుతోంది. అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్‌లపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
previous post