telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

అచ్చం టమాటాల్లాగా ఉన్నాయి.. ధర మాత్రం రూ. 100కు నాలుగే!

fruits sweet kashmir

తెలంగాణలోని నిజామాబాద్‌ నగరంలో అచ్చం టమాటాల్లాగా ఉండే పండ్లు తోపుడు బండ్లపై కనిప్పించాయి. కానీ వీటి ధర మాత్రం ఆకాశంలో ఉంది. రూ. 100కు నాలుగే నాలుగట. వీటి స్పెషల్ ఏంటని అనుకుంటున్నారా? ఇవి టమాటాల మాదిరిగానే కనిపిస్తాయి. కానీ, వీటి పేరు స్వీట్ ఓమర్ పండ్లు. కశ్మీర్ నుంచి దిగుమతి అవుతుంటాయి.

నిజామాబాద్ నగరంలోని ఖలీల్‌వాడి ప్రాంతంలో ఫ్రూట్ మార్కెట్ వ్యాపారులు, వీటిని తోపుడు బండ్లపై పెట్టి వీధుల్లో తిరుగుతూ విక్రయించారు. అన్నట్టు ఇవి ఎప్పుడు పడితే అప్పుడు లభించవు. కొన్ని ప్రత్యేక సీజన్ లలో మాత్రమే వస్తుంటాయట. ఇక ఇవి టమాటోల రూపంలో ఉండటంతో వీటిని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

Related posts