telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ప్రైవేటు బ్యాంకులు పనిచేస్తాయి!

icici bank

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నేడు, రేపు ఆ బ్యాంకులు మూతపడనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 60 వేల మంది ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. పెండింగ్ లో ఉన్న వేతన సవరణ సమస్యను పరిష్కరించాలంని ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ 20 సార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. దీంతో చివరికి సమ్మెకు దిగాలని నిర్ణయించుకుంది.

బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఫలితంగా నేడు, రేపు బ్యాంకులు మూతపడనున్నాయి. ఎల్లుండి ఆదివారం కావడంతో ఆ రోజు కూడా సెలవే. అంటే వరుసగా మూడు రోజులు బ్యాంకుల మూత తప్పదు. అయితే, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రైవేటు బ్యాంకులకు మాత్రం ఈ సమ్మె ప్రభావం లేదు. ప్రైవేటు బ్యాంకులన్నీ యథావిధిగా పనిచేస్తాయని బ్యాంకు వర్గాలు వెల్లడించాయి.

Related posts