telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ముగిసిన విశాఖ ప‌ర్య‌ట‌న‌ : శ్రీశారదా పీఠం వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏపీ సీఎం జ‌గ‌న్‌..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ పర్యటన ముగిసింది. విశాఖ శ్రీశారదా పీఠం మూడో రోజు వార్షిక మహోత్సవంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు.

దేశ రక్షణ కోసం శారదా పీఠంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా మాఘమాసం పంచమి నుండి దశమి వరకు 5 రోజుల పాటు శారదా పీఠం వార్షికోత్సవాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి.

ఈ ఉత్స‌వాల్లో సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు మంత్రులు అవంతి శ్రీనివాస్.. ధర్మాన కృష్ణదాస్… టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ పాల్గొన్నారు.

రాజశ్యామలాదేవి అమ్మవారి ఆలయంలో సీఎం జ‌గ‌న్ ప్రత్యేక పూజలు చేశారు. రుద్ర హోమం పూర్ణాహుతికి సీఎం హాజరయ్యారు. విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాల సందర్శించారు. రాజశ్యామల పూజ కోసం వేద పండితులు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో సంకల్పం చేయించారు.

తర్వాత సీఎం చేతులమీదుగా కలశ స్థాపన చేయించారు.అనంతరం వేద పండిత సభలో ఆయన పాల్గొన్నారు.

విశాఖ శ్రీశారదాపీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు సీఎం.. ఉత్తీర్ణతా పత్రాలు, మెడల్స్ అందజేశారు.

అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం.. అక్కడ నుంచి గన్నవరం బయల్దేరారు.

Related posts