మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 23 న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ నెల 27 అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఏపీ సీఈవో ద్వివేది స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితిలో కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉంటాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలు పై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫలితం ఎటూ తేలకపోతే ఈసీకి విచక్షణాధికారం ఉంటుందని ఆయన తెలిపారు. ఏదైనా ఈవీఎం మొరాయించి వీవీ ప్యాట్ లెక్కలో తేడా వస్తే మిగతా లెక్కింపులో పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం అతి తక్కువగా ఉంటే రీపోలింగ్‌కు ఆదేశించే అవకాశాలు ఉంటాయని సీఈవో ద్వివేది పేర్కొన్నారు.