telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మహారాష్ట్రలో కరోనా మహోగ్రరూపం.. ఒక్క రోజే 7,975 కేసులు నమోదు

Corona

మహారాష్ట్రలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజు రోజుకు అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 7,975 మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారినపడిన బాధితుల సంఖ్య 2,75,640కు చేరుకుంది. వీరిలో 1,11,801 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 233 మంది కరోనా కారణంగా మృతి చెందినట్టు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న 3,606 మంది రోగులు కొవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 1,52,613కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం రికవరీ రేటు 55.37 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

Related posts