ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదికి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డా. సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు విచారణాధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆమె ద్వివేదిని కోరారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేస్తామని సునీతా రెడ్డి వెల్లడించారు.
previous post
next post