telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ముదురుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు వివాదం…

electricity current pole

విద్యుత్ చట్ట సవరణ బిల్లు తెలంగాణ వర్సెస్ కేంద్రంగా మారిపోయింది పరిస్థితి.. ఫిబ్రవరి 17వ తేదీన ఢిల్లీలో అన్ని రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించిన కేంద్ర విద్యుత్ శాఖ.. విద్యుత్ చట్ట సవరణ బిల్లు ఉద్దేశ్యాలను వివరించి అభిప్రాయాలు సేకరించింది.. ఇక, బిల్లును తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తున్నట్టుగా రికార్డుల్లో నమోదు చేసింది కేంద్రం.. విద్యుత్ ఉద్యోగులు సర్ ప్లస్ ఉన్నారని.. వారి సంక్షేమనికి సంబంధించిన అంశంతో పాటు పునరుత్పాదక విద్యుత్ బాధ్యతకు సంబంధించిన అంశాలను కూడా తెలంగాణ లేవనెత్తిందని.. స్వయంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ నిర్వహించిన సమావేశం మినట్స్‌లో పేర్కొన్నారు. ఆ సమావేశానికి ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రారు హాజరు అయ్యారు. కానీ, ఆయన వాదన మాత్రం మరోలా ఉంది.
ఈ బిల్లును తెలంగాణ సర్కార్ స్వాగతించినట్టుగా కేంద్రం స్పష్టం చేస్తుండగా.. , బిల్లులో వ్యవసాయానికి మీటర్లు బిగించమని కేంద్రం చెప్పడాన్ని మాత్రమే స్వాగతించామని చెబుతున్నారు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు. అయితే చూడాలి మరి ఇంకా ఏం జరగనుంది అనేది.

Related posts