telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మన రాజ్యాంగం సక్రమంగా అమలు కాలేదు : ఈటల

ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతూనే సమాజ సంక్షేమం కోసం పోరాడే వాళ్లం.. ప్రజల ఆకాంక్షల మేరకు మనం పనిచేయాలని సూచించారు. భారత దేశ పౌరుడిగా, సగటు మనిషిగా స్పందించాలన్న ఈటల.. ఎర్రకోట సాక్షిగా మన రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం.. కానీ, అది సక్రమంగా అమలు కాలేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అందుకే  క్రిమిలేయర్ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నారు.. మెరిట్ లేకుండా ఏ సీటు రాదు.. మనల్ని పాలించే వారికి కూడా మెరిట్ ఉండాలని.. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోగలగడమే ఆ మెరిట్ అన్నారు ఈటల రాజేందర్.  సంపద కేంద్రీకరించడమే పేదరికానికి కారణంగా తెలిపారు మంత్రి ఈటల రాజేందర్.. అంబానీ ఒక్కడి సంపద పెరిగితే పేదరికం పోదన్న ఆయన.. ఎలుకల బాధకు ఇల్లుని తగలబెట్టుకోవద్దు.. ఢిల్లీ రైతు బాధ ఏదో ఒక నాడు నీ గడప కూడా తొక్కుతుందని వ్యాఖ్యానించారు. ఉద్యమాలు ప్రజలకోసం చేస్తే వారితో గొంతు కలపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసిన ఆయన.. రాజకీయాలు మాట్లాడడం లేదు.. తాను రైతుల కోసం మాట్లాడుతున్నా.. కేంద్రం.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దు అని హెచ్చరించారు.

Related posts