telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ : .. అగ్రిగోల్డ్ బాధితులకు .. 264 కోట్ల నిధులు విడుదల..

jagan

ఏపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ బాధితులకు రూ.264,99,00,983లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని మొదట రాష్ట్రంలోని 13 జిల్లాలో రూ.10 వేల లోపు డిపాజిట్లు కలిగిన 3,69,655 మందికి పంపిణీ చేయనున్నట్లు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిషోర్‌కుమార్‌ తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన విషయం తెలిసిందే. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ కోరినా చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కూలీలు, పేదలు, మధ్యతరగతి వర్గాలు ఎంతోమంది అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేసి నష్టపోయారు. అగ్రిగోల్డ్‌ బాధితుల భరోసా కమిటీ ద్వారా వైఎస్‌ జగన్‌ వారికి అండగా నిలిచారు. ఎన్నికల ముందు వారికి ఇచ్చిన హామీ ప్రకారం బడ్జెట్ లో రూ.1,150 కోట్లు కేటాయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా లీగల్‌ సెల్‌ అథారిటీ చైర్మన్, కలెక్టర్లు ప్రతిపాదించిన ప్రకారం రూ.10 వేల లోపు డిపాజిటర్ల జాబితాకు అనుగుణంగా పంపిణీ చేయనున్నారు. రూ.20 వేల డిపాజిట్లకు సంబంధించి కూడా పరిశీలన జరుగుతున్నట్లు తెలిసింది.

Related posts