బీహార్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ-జేడీయూ కూటమికి సీఎం నితీశ్ కుమార్ నాయకత్వ బాధ్యతలు చేపడుతారని కేంద్ర మంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. బీజేపీ-జేడీయూ బంధం విడదీయరానిదని, ఐక్యంగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నారు. నితీశ్ సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని షా తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రెండు పార్టీలు పనిచేస్తున్నాయని షా అన్నారు.
కూటమిలో విబేధాలు ఉన్నాయన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా షా కొన్ని కామెంట్స్ చేశారు. శివసేన లేకుండా బీజేపీ ఒంటరిగా మెజారిటీ సాధించలేదని స్పష్టం చేశారు. బీజేపీ-శివసేన కూటమికి మూడవ వంతు మెజారిటీ వస్తుందన్నారు. గతంతో పోలిస్తే బీజేపీ తన స్థానాలను పెంచుకుంటుదని చెప్పారు.