telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రజాకోర్టులో సీఎం కేసీఆర్‌ను దోషిగా చూపుతాం: కె లక్ష్మణ్

BJPpresident -K-Laxman

టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ మరోసారి మండిపడ్డారు. ప్రజల సొమ్మును దుబారా చేస్తే బీజీపీ ఊరుకోదని అన్నారు. విద్యుత్ ఒప్పందాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధం కావాలని అన్నారు. ప్రజాకోర్టులో సీఎం కేసీఆర్‌ను దోషిగా చూపుతామన్నారు. అవినీతిలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి డాక్టరేట్‌ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలోని అన్ని రంగాల్లో అవినీతిని వెలికి తీస్తామని లక్ష్మణ్ పేర్కొన్నారు.

విద్యుత్ విషయంలో అధికారులతో వివరణ ఇప్పించడం వెనుక అంతర్యమేంటని ప్రశ్నించారు. అధికారులను వారినే బలి పశువులను చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ బిల్లు చెల్లించని సర్పంచ్‌ను తొలగిస్తామన్న మిమ్ములను విద్యుత్ సంస్థలకు బిల్లులు కట్టనందుకు ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రభుత్వం చేతగానితనంతోనే విద్యుత్ సంస్థలు రూ.20వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని అయన పేర్కొన్నారు.

Related posts