telugu navyamedia
సినిమా వార్తలు

లోకల్ , నాన్ లోకల్ అనే మాటే తప్పు: సుమన్

“మా” ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ రెండు పోటీపడుతున్నాయి. ఈ రెండు గ్రూపులు విజయం కోసం హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రకాష్ రాజ్ “మంచి ప్యానల్ ను ఎన్నో కోండి – మంచు ప్యానల్ ను కాదు ” అనే నినాదంతో ముందుకు పోతున్నారు, ఇక మంచు విషుని ” ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ . నన్ను మాత్రమే ఎన్నోకోండి ” అని ప్రచారం చేసున్నారు. విష్ణు చేస్తున్న ప్రచారం పై ప్రకాష్ రాజ్ తీవ్రంగా మండిపడుతున్నాడు. తనకు భాషా భేదం లేదని, తాను అందరి వాడినని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా నటులను లోకల్, నాన్ లోకల్ అనే దృష్టితో చూడవద్దన్నారు

తాజాగా ఇదే విషయంపై సీనియర్‌ నటుడు సుమన్ స్పందించారు. నటీనటులను ఆ రకంగా వేరు చేసి చూడటం మంచి పద్ధతి కాదని , మనమందరం భారతీయులమని చెప్పాడు . ఉపాధి కోసం కోసం కూలీలు ఎక్కడికెక్కడికో వెడుతుంటారు. వారు నాన్ లోకల్ అని పని ఇవ్వకుండా గెంటేస్తున్నారా ? “మా ” ఎన్నికల్లో ఇలాంటివి ప్రచారం చెయ్యడం ఆరోగ్యకమైన పద్ధతి కాదని సుమన్ హితవు చెప్పారు .

Related posts