నెల రోజుల కిందటి వరకు తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మళ్ళీ పెరుగుతున్నాయి. అయితే గత మూడు రోజులుగా దేశంలో రోజువారీ కేసుల సంఖ్య 80 వేలు దాటిపోతున్నది. మరణాల సంఖ్య కూడా భారీగా నమోదవుతున్నది. 11 రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఛత్తీస్ గడ్ లో కూడా కేసులు భారీగా నమోదవుతున్నాయి. నిన్నటి రోజున ఛత్తీస్ గడ్ లో 4174 కేసులు, 43 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఛత్తీస్ గడ్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్ గడ్ లోని దుర్గ్ జిల్లాలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయ్యి కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈనెల 6 నుంచి తొమ్మిది రోజులపాటు అంటే ఏప్రిల్ 14 వ తేదీ వరకు సంపూర్ణ లాక్ డౌన్ ను విధించాలని నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని క్లోజ్ లో ఉంటాయని దుర్గ్ జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అయితే ఇప్పటికే వేరే రాష్ట్రాలలో కూడా కొన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.
previous post
next post