telugu navyamedia
వార్తలు సామాజిక

తెరుచుకున్న కేథార్‌నాథ్ ఆలయం..భక్తులకు అనుమతి ఎప్పుడో!

kedarinath temple doors

శాస్త్రోప్తవేతంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కేథార్‌నాథ్ ఆల‌య త‌లుపులు తెరుచుకున్నాయి. ఆరునెలల పాటు మూసివున్న ఆల‌య త‌లుపులను వేద పండితులు తెరిచారు. ఈ ఉదయం సరిగ్గా 6 గంటల 10 నిముషాలకు ఆలయం తలుపులు ఓపెన్ చేశారు. అంతకుముందు పవిత్ర పంచముఖి డోలి యాత్ర జరిగింది. ఉత్తరాఖండ్ లోని గడ్డస్థల్ వద్ద ప్రారంభమైన యాత్ర .. గౌరీకుండ్ వరకు వాహనంలో సాగింది. అక్కడి నుంచి కాలినడకన కేదారనాథున్ని డోలి యాత్ర ద్వారా ఆలయానికి తీసుకువచ్చారు.

భారీ సంఖ్యలో హాజరయ్యే ఈ కార్యక్రమానికి కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా భక్తులు ఎక్కడికీ కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో కేవలం ఐదుగురు పూజారులు మాత్రమే డోలీ యాత్రలో పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా ఆలయానికి భక్తులు ఎప్పుడు అనుమతిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

Related posts