telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

మారుతీ సుజుకీ బొంపర్ ఆఫర్..బీఎస్‌-6 కార్లపై ధరల తగ్గింపు!

offer in laks on audi cars

మారుతీ సుజుకీ బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన పలు కార్లపై డిస్కౌంట్లను అందిస్తున్నది. ఈ ఆఫర్లు ఈ నెల 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఆ కంపెనీ తెలిపింది. ఇక మారుతీ సుజుకీ తన బీఎస్‌-6 కార్లపై అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

వినియోగదారులు ఈ కారును కొనుగోలు చేయడం వల్ల రూ.45వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. రూ.10వేల క్యాష్‌ డిస్కౌంట్‌తోపాటు రూ.25వేల వరకు బోనస్‌ ఎక్స్‌ఛేంజ్‌, రూ.10వేల వరకు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు.

ఇక ఈ కారుకు చెందిన అన్ని వేరియెంట్లపై ఎంపిక చేసిన ఆఫర్లను అందిస్తున్నారు. ఈ కారు 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తుంది. రూ.8.31 లక్షల ప్రారంభ ధరకు ఈ కారు అందుబాటులో ఉంది. గరిష్టంగా ఈ కారు ధర రూ.11.09 లక్షలుగా ఉంది. మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్‌6 ఎంపీవీ కారుపై రూ.15వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌ను అందిస్తున్నారు. రూ.9.84 లక్షల ప్రారంభ ధరకు ఈ కారు వినియోగదారులకు అందుబాటులో ఉంది.

Related posts