telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ జగన్ : 48 గంటల్లో నియామకాలు చేపట్టాలని ఆదేశాలు

cm jagan

ఇవాళ స్పందన కార్యక్రమంపై సమీక్ష నిరహించింది ఏపీ ప్రభుత్వం. ఈ సందర్బంగా కోవిడ్‌–19, ఉపాధి హామీ పనులు. (లేబర్‌ బడ్జెట్‌. గ్రామ సచివాలయాల భవనాలు. ఆర్బీకే భవనాలు, డాక్టర్‌ వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ (రూరల్‌). ఏఎంసీయూ, బీఎంసీయూలు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం), డాక్టర్‌ వైయస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌, 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టా, ఇళ్ల నిర్మాణం, మే నెలలో క్యాలెండర్‌ ప్రకారం పథకాలు ఇంకా పలు అంశాలపై సమావేశం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌కు సంబంధించిన అన్ని సమస్యలకు 104 కాల్ సెంటర్ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ గా ఉండాలని.. 104కు ఫోన్‌ చేసిన వెంటనే 3 గంటల్లో బెడ్‌ కేటాయించాలని ఆదేశించారు. మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలని… 104 కాల్‌ సెంటర్‌కు సంబంధించి తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని ఆస్పత్రులలో వైద్య సిబ్బంది, పారా మెడికల్‌ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలని..ఎక్కడ ఖాళీలున్నా వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించండి.. 48 గంటల్లో నియామకాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు సిఎం జగన్. ప్రజలు ఒకే చోట చేరకుండా చూడాలని..పెళ్లిళ్లలకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. స్విమ్మింగ్‌ పూల్స్, జిమ్‌లు, పార్కుల్లో అందరూ ఒకేచోట చేరకుండా చూడాలన్నారు. జిల్లాల్లో ఒక జేసీ ఇక నుంచి కోవిడ్‌పైనే దృష్టి పెట్టాలని.. అప్పుడే మనం అనుకున్న స్థాయిలో సేవలందించగలుగుతామని పేర్కొన్నారు.

Related posts