telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

సోషల్ మీడియా యాప్స్ పై కేసు నమోదు

social media

సోషల్ మీడియా యాప్స్ వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ లపై హైదరాబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు క్రిమినల్ కేసులను నమోదు చేశారు. ఇండియాలో సోషల్ మీడియా యాప్స్ పై క్రిమినల్ కేసు నమోదు చేయడం ఇదే తొలిసారి. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ వాసి ఎస్‌ శ్రీశైలం అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా సోషల్‌ మీడియా యాప్స్‌ తో పా టు వాటి నిర్వాహకులను నిందితులుగా చేర్చారు.

,2019, డిసెంబర్ 12న పార్లమెంట్ లో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందిన తరువాత, సామాజిక మాధ్యమాల్లో విద్వేష ప్రసంగాలు, జాతి వ్యతిరేక ప్రచారం జరుగుతోందని, దీన్ని నిలువరించాలని కోరుతూ శ్రీశైలం తొలుత హైదరాబాద్‌ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ గ్రూప్ లలో పాక్ కు చెందిన వారున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో శ్రీశైలం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts