telugu navyamedia
క్రైమ్ వార్తలు

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను అరెస్ట్ చేసిన సీబీఐ ..ఐదేళ్ల జైలు శిక్ష

*పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ కేసులో శిక్ష‌
*కొత్త ప‌ల్లి గీతా స‌హా నిందితుల‌ను అదుపులోకి తీసుకు సీబీఐ
*ఐదేళ్ళు జైలు శిక్ష‌తో పాటు జ‌రిమానా

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అరెస్ట్ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.50 కోట్ల రూపాయల రుణం తీసుకుని ఎగవేసిన అభియోగాలపై మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

ఈ కేసును విచారించిన సీబీఐ కోర్టు.. గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. గీత భర్త పి.రామకోటేశ్వరరావుకు కూడా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష ఫైన్ వేసింది.

నిన్న రాత్రి నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు ఇవాళ అరెస్టు చేశారు. వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి వారిని తరలించారు.

గతంలోనే విశ్వేశ్వర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ డైరెక్టర్లతోపాటు కొత్తపల్లి గీత, ఆమె భర్తకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేసింది. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎండీగా గీత భర్త ఉన్నారు. గతంలో చెక్ బౌన్స్ కూడా అయింది.

దీనిపై కొత్తపల్లి గీత భర్తపై క్రిమినల్ కేసు కూడా నమోదయింది. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి కొత్తపల్లి గీత ష్యూరిటీ ఇచ్చారు. ఎలాంటి మొత్తాన్ని చెల్లించకపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు చేసిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు..మరోవైపు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో కొత్తపల్లి గీత పిటిషన్ దాఖలు చేశారు.

Related posts