telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కదులుతున్న రైలులో గర్భిణికి పురుడు పోసిన వైద్య విద్యార్థిని..

సికింద్రాబాద్ – విశాఖ దురంతో రైలులో ప్రయాణిస్తున్న సత్యవతి అనే ఓ గర్భిణికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి.  అదే బోగీలో ప్రయాణిస్తున్న విశాఖపట్నం గీతం వైద్య కళాశాల విద్యార్థిని స్వాతిరెడ్డి దీనికి వెంటనే స్పందించింది. తోటి మహిళల సహాయంతో విద్యార్థిని ట్రైన్ లో పురుడు పోసింది.

వివ‌రాల్లోకి వెళితే..

సత్యవతి, సత్యనారాయణలది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పొన్నం గ్రామం. స్వగ్రామానికి వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున రాజమహేంద్రవరం దాటగానే నొప్పులు మొద‌లైయ్యాయి. దురంతో ఎక్స్ ప్రెస్‌కు విశాఖ వెళ్ళేదాకా ఎక్కడా హాల్ట్ లేదు.

ఆమె భర్త సత్యనారాయణకి ఏం చేయాలో అర్థం కాలేదు. సాయం చేయాలని కనిపించిన వారినల్లా అడిగారు.అదే బోగీలో ప్రయాణిస్తున్న విశాఖపట్నం గీతం వైద్య కళాశాల విద్యార్థిని స్వాతిరెడ్డి దీనికి వెంటనే స్పందించింది. తోటి మహిళల సహాయంతో విద్యార్థిని ట్రైన్ లో పురుడు పోసింది.

సత్యవతి పరిస్థితి గురించి టీటీఈ అందించిన సమాచారం మేరకు అనకాపల్లిలో స్టేషన్ మాస్టర్ వెంకటేశ్వరరావు రైలు ఆపించారు. 108 అంబులెన్స్లో స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. గైనకాలజిస్ట్ అనురాధ తల్లీబిడ్డలకు వైద్య పరీక్షలు చేశారు. బిడ్డకు వైద్య సహాయం అందేవరకు స్వాతిరెడ్డి వారి వెన్నంటే ఉన్నారు. ఆమెకు సత్యవతి, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Medical Student Helps Woman Deliver Baby On Train

ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు మెడిసిన్ చదువుతున్న విద్యార్థినికి ధన్యవాదాలు తెలిపారు. ఈ రైలు ప్రయాణంలో తమ తల్లి బిడ్డలను కాపాడిన ఆ విద్యార్థినిని అందరూ అభినందించారు.

Related posts