*అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పెళ్ళింట విషాదం
*శోభనం గదిలో అర్ధరాత్రి వరుడు తులసీప్రసాద్ మృతి
*నిన్న రాత్రి నవదంపతులకు శోభన ఏర్పాట్లు
*ఈ ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పెళ్ళింట విషాదం జరిగింది. మదనపల్లెలో నవ వరుడు శోభనం గదిలో మృతిచెందాడు. పెళ్లి జరిగి ఒక్క రోజు కూడా గడవకముందే.. అతడు మృతిచెందాడు.
వివరాల్లోకి వెళ్తే..
మదనపల్లె చంద్రా కాలనీకి చెందిన యువతితో.. పాకాల మండల పత్తిపాటివారిపల్లికి చెందిన తులసి ప్రసాద్‌కు పెద్దల సమక్షంలో ఈ నెల 12( సోమవారం) పెళ్లి జరిగింది.
కొంతకాలం కిందట ఫేస్ బుక్ ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.మొదట్లో ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోకపోయినా ఆ తరువాత వారిని ఒప్పించారు. మదనపల్లెలోని ఓ కళ్యాణ మండపంలో బంధు, మిత్రుల సమక్షంలో వివాహ వేడుకను సోమవారం నాడు ఎంతో గ్రాండ్ ను నిర్వహించారు.
ఈ క్రమంలోనే పెళ్లి అనంతరం శోభనం తంతుకోసం తులసి ప్రసాద్ అత్తగారి ఇంటికి వెళ్లాడు. అయితే రాత్రి సమయంలో తులసి ప్రసాద్ ఉన్నట్టుండి అచేతనంగా పడిపోయాడు. ఉలుకు..పలుకు లేకపోవడంతో వధువు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని వరుడి కుటుంబ సభ్యులు తమ స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయనున్నారు.
పెళ్లి సందర్భంగా ఇంటికి కట్టిన తోరణాలు ఇంకా పచ్చగానే ఉన్నాయి.. అదే ఇంటి ముందు అతడు నిర్జీవంగా ఉండటాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఏపీ సీఎం పై జేపీ నేత లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు…