*అమరావతిలో పెద్ద స్కామ్‌కు చంద్రబాబు పునాది వేశారు..
*అది ప్రజల పాదయాత్ర కాదు.. రియల్‌ఎస్టెట్ యాత్ర..
*ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే యాత్ర..
*అసెంబ్లీకి వచ్చేది లేదని శపథం చేశారు కదా..
ఒకరోజు అసెంబ్లీకి రండీ పోలవరంపై చర్చిద్దాం..
*చంద్రబాబు తప్పిదం వల్లే పొలవరాని నష్టం
అసెంబ్లీకి వచ్చేది లేదని శపథం చేశారు కదా.. ఒకరోజు అసెంబ్లీకి వస్తే పోలవరంపై చర్చిద్దామని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబును కోరారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ..చంద్రబాబు తప్పిదం వల్లే పొలవరానికి వేల కోట్ల నష్టం జరిగిందన్నారు
డయాఫ్రం వాల్ ఎందుకు కొట్టుకుపోయిందో ప్రజలకు శాసనసభ సాక్షిగా తెలియజేయాలని అంబటి రాంబాబు అన్నారు. శాసనసభకు రాను అని శపథం చేసిన మీరు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చారు కాబట్టి శాసనసభకు కూడా రావాలని అంబటి రాంబాబు ఆహ్వానించారు.
తాము ఉన్నది ఉన్నట్లుగానే చెబుతామని అబద్ధాలు చెప్పాల్సిన పని తమ ప్రభుత్వానికి లేదని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు తప్పిదం వల్లనే పోలవరానికి శాపంగా మారిందన్నారు.
అమరావతి రైతుల పాదయాత్ర ప్రాంతాల మధ్య విభేదాలను సృష్టించడానికేనని అన్నారు. రియల్ ఎస్టేట్ వారు చేస్తున్న పాదయాత్ర అని అంబటి రాంబాబు అన్నారు. రెండు చేతులా సంపాదించుకోవడానికే ఈ పాదయాత్ర అని ఆయన అన్నారు.
భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్‌కు పునర్‌వైభవం తీసుకురావాలని రాహుల్ గాంధీ భావిస్తుంటే ఆ పార్టీకిి భాజపా పెద్ద షాక్ ఇచ్చింది. గోవాలో కాంగ్రెస్‌కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు గోవా భాజపా చీఫ్ సదానందా శేఠ్ తెలిపారు.
కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్..మసిబూసిన మారేడుకాయ: చంద్రబాబు