మీడియా ప్రతినిధులపై దాడి కేసులో నిన్న పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ అరెస్టుల టీడీపీ ఎంపీ కేశినేని ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగాలు చేశారని టీడీపీ ఎంపీ కేశినేని అన్నారు.
రైతులకు తరతరాలుగా వారసత్వంగా సంక్రమించిన భూమిని త్యాగం చేసిన రైతులకు మీరిచ్చే బహుమతి హత్యా యత్నం కేసులు పెట్టి జైలులో పెట్టటమా జగన్ అన్నా?’ అని ప్రశ్నిస్తూ కేశినేని నాని ట్వీట్ చేశారు. అరెస్టులకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.
నా భార్య నైతిక విలువలున్న మనిషి: సిద్ధూ