లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుదలను నిలిపివేస్తూ కేంద్రం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మధ్య తరగతి ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంతో ఉపయుక్తంగా ఉండే డీఏ పెంపుదలను స్థంభింపజేయడం అనాగరికమని రాహుల్ వ్యాఖ్యానించారు. డీఏ పెంపు నిలిపవేయడం కంటే కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులను పక్కనబెడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దీంతో ఎంతో డబ్బు ఆదా అయ్యేదని వివరించారు.
కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు, జవాన్లు ఎంతోమంది కరోనాపై ముందుండి పోరాడుతున్నారు. లక్షలాది కోట్ల రూపాయలతో చేపడుతున్న బుల్లెట్ రైళ్లు, సెంట్రల్ విస్టా సుందరీకరణ ప్రాజెక్టులను నిలిపివేయకుండా, అమానవీయ రీతిలో, ఏమాత్రం జ్ఞానం లేకుండా డీఏ పెంపు నిలిపి వేశారు” అంటూ ట్వీట్ చేశారు.